ఇన్‌స్టా లైవ్‌.. స్టార్ హీరోయిన్ తంటాలు | Katrina Kaif Accidentally Goes Live On Instagram Expressions Viral | Sakshi
Sakshi News home page

అనుకోకుండా ఇన్‌స్టా లైవ్‌.. హీరోయిన్ తంటాలు

May 5 2020 9:02 AM | Updated on May 5 2020 10:24 AM

Katrina Kaif Accidentally Goes Live On Instagram Expressions Viral - Sakshi

సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్ప‌టికప్పుడూ ట‌చ్‌లో ఉండే బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ చేసిన ఓ తుంట‌రి ప‌ని అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. చాలా వ‌ర‌కు సెల‌బ్రటీలు ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించేందుకు అందంగా ముస్తాబై ఏ టైంకి లైవ్‌కి వ‌స్తున్నామో ముందే షేర్ చేస్తారు. అయితే  అనుకోకుండా క‌త్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఆప్ష‌న్ నొక్కారు. దీంతో నిజంగానే ఆమె లైవ్‌లోకి వ‌చ్చార‌నుకొని చాలామంది ఫ్యాన్స్ లైవ్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక  కొద్దిసేప‌టి వ‌ర‌కు అయోమ‌యంలో ప‌డిపోయింది. అనుకోకుండా ఏర్ప‌డిన ప‌రిస్థితి కావ‌డంతో నేనెలా లైవ్‌కి వ‌చ్చానురా బాబు అంటూ క‌త్రినా ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రేష‌న్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. (అర్జున్‌ ఫొటోకు కత్రినా కామెంట్‌!)

అప్ప‌టికే చాలామంది అభిమానులు లైవ్‌లో జాయిన్ అవ‌డంతో ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి కాస్తా వైర‌ల్ కావ‌డంతో వావ్ క‌త్రినా మీరు మేక‌ప్ లేకుండా కూడా చాలా బాగున్నారు. మీ ఎక్స్‌ప్రెష‌న్స్ సూప‌ర్బ్‌ అంటూ క‌త్రానాను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇక క‌రోనాపై పోరుకు క‌త్రిన త‌న వంతు సాయంగా మ‌హారాష్ట్ర సీఎం కేర్‌, పీఎం కేర్ రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఈ స‌హాయంలో త‌మ వంతు పాత్ర పోషించాలని కోరిన సంగ‌తి తెలిసిందే. క‌త్రిన త‌దుప‌రి చిత్రం సూర్య‌వంశీ మార్చి 24న విడుద‌ల కావాల్సి ఉండ‌గా, క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. (దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌)

Advertisement
 
Advertisement
Advertisement