హీరోయిన్‌ లేదు! | karthi managaram movie launch | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ లేదు!

Dec 14 2018 6:00 AM | Updated on Dec 14 2018 6:00 AM

karthi managaram movie launch - Sakshi

అలా ఒక సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి గుమ్మడికాయ కొట్టారో లేదో మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడుతున్నారు తమిళ హీరో కార్తీ. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో ‘దేవ్‌’ సినిమాను కంప్లీట్‌ చేసిన ఆయన తాజాగా ‘మా నగరం’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో హీరోగా నటించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్‌ లేదని కోలీవుడ్‌ సమాచారం. నరీన్, రమణ, జార్జి మరియన్‌ ముఖ్యతారలుగా నటించనున్న ఈ సినిమాకు శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తారు.

‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. సినిమాలో 70శాతం పోరాట సన్నివేశాలే ఉంటాయి. అందుకే స్క్రిప్ట్‌ పరంగా హీరోయిన్‌ అవసరం లేదనుకుంటున్నాం. స్టంట్‌ డైరెక్టర్‌ అన్బరివు యాక్షన్‌ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇటీవల కార్తీ నటించిన తమిళ చిత్రాలు కచ్చితంగా తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. సో.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఊహించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement