స్టైలిష్‌ దేవ్‌ | karthi dev first look release | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ దేవ్‌

Oct 26 2018 12:43 AM | Updated on Jul 23 2019 11:50 AM

karthi dev first look release - Sakshi

దేవ్‌

కుర్రాడు వాడే బైక్‌ మాత్రమే కాదు కుర్రాడు కూడా స్పీడే. మరి.. దేవ్‌ స్పీడ్‌కు ఎవరైనా బ్రేక్‌లు వేశారా? వేస్తే.. ఆ తర్వాత గేర్‌ మార్చి దేవ్‌ ఎలా స్పీడ్‌గా దూసుకెళ్లాడు? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ‘దేవ్‌’ సినిమా చూడాల్సిందే. కార్తీ హీరోగా రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. రకుల్‌ప్రీత్‌ సింగ్, నిక్కీ గల్రానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు.  లక్ష్మణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ‘ఠాగూర్‌’ మధు సొంతం చేసుకున్నారు.

గురువారం దేవ్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.‘‘ఖాకీ’ వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత కార్తీ, రకుల్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. చెన్నై, హైదరాబాద్, ముంబై, హిమాలయాస్‌ వంటి లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కార్తీక్‌ ముత్తు రామన్, ఆర్‌.జె. విఘ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement