2019లో సల్మాన్‌ పెళ్లి : కరణ్‌ జోహర్‌

Karan Johar Reveals Whom Is Salman Khan Going To Marry in 2019 - Sakshi

బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు సల్మాన్‌ ఖాన్‌. 53 ఏళ్ల వయసులో ఉన్నా సల్మాన్‌ పెళ్లి వార్తలు ఇప్పటికీ బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ నటి నేహాధూపియా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘నో ఫిల్టర్‌ నేహా’ కార్యక్రమంలో పాల్గొన్న కరణ్‌.. సల్మాన్‌ పెళ్లిపై స్పందించారు.

2019 సల్మాన్‌ఖాన్‌ పెళ్లి చేసుకుంటారన్న కరణ్‌, తాను పెళ్లి చేసుకోబోయేది అమ్మాయిని కాదు. ఇప్పటికే కమిట్‌ అయిన మూడు సినిమాలనే సల్మాన్‌ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న సల్మాన్‌ ఖాన్ ప్రస్తుతం భారత్‌, దబాంగ్‌ 3 సినిమాలతో పాటు మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top