రాళ్లల్లో.. రప్పల్లో..! | Kangna ranaut peed behind rocks and dressed in open for shooting rangoon | Sakshi
Sakshi News home page

రాళ్లల్లో.. రప్పల్లో..!

Oct 27 2016 12:18 AM | Updated on Aug 9 2018 7:30 PM

రాళ్లల్లో.. రప్పల్లో..! - Sakshi

రాళ్లల్లో.. రప్పల్లో..!

‘రాళ్లల్లో.. ఇసుకల్లో రాశాము ఇద్దరు పేర్లు...’ అంటూ బాలకృష్ణ, రజనీ పాడుకున్న డ్యూయెట్ గుర్తుండే ఉంటుంది.

‘రాళ్లల్లో.. ఇసుకల్లో రాశాము ఇద్దరు పేర్లు...’ అంటూ బాలకృష్ణ, రజనీ పాడుకున్న డ్యూయెట్ గుర్తుండే ఉంటుంది. ‘రంగూన్’ సినిమా షూటింగ్ సమయంలో కంగనా రనౌత్ డ్యుయెట్ మినహా రాళ్లల్లో, రప్పల్లో చాలా పనులే చేశారు. చేసే పాత్ర నచ్చిందంటే చాలు, ఎలాంటి త్యాగాలకైనా ఈ హాట్ గాళ్ రెడీ అయిపోతారు. అందుకు ‘రంగూన్’ సినిమా ఓ ఉదాహరణ. ఈ సినిమా కోసం అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. రాళ్లూ రప్పలూ తప్ప పూరి గుడిసె కూడా లేని ప్రాంతంలో చిత్రీకరణ జరిపినప్పుడు కంగనా చాలా ఇబ్బంది పడ్డారట.
 
 ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం కదా అని ఎక్కడికెళితే అక్కడ ఇంట్లో ఉన్నట్లే అన్ని సౌకర్యాలూ ఉండాలనుకుంటే కుదరదు. సర్దుకుపోవాలి. ‘రంగూన్’ షూటింగ్ అప్పుడు లొకేషన్‌లో నాకు వ్యానిటీ వ్యాన్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో పెద్ద పెద్ద రాళ్లు చూసుకుని, వాటి వెనకాల బట్టలు మార్చుకునేదాన్ని. రాళ్లు కనపడని చోట యూనిట్ సభ్యులందరూ ఒక దడిలా నిలబడేవాళ్లు. నేను కాస్ట్యూమ్స్ వేసుకునేదాన్ని.
 
 అంతెందుకండి.. ప్రకృతి అవసరానికి కూడా ఇబ్బంది అయ్యేది. రాళ్లల్లో.. రప్పల్లోనే. తప్పదు. అడ్జస్ట్ కావాల్సిందే. కాదు కూడదు.. నాకు వ్యానిటీ వ్యాన్ కావాల్సిందేనని మొండిగా వాదిస్తే.. నిర్మాత మాత్రం ఏం చేయగలుగుతారు? అలాంటి లొకేషన్లో ఎవరూ ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి కంగనాకి తలబిరుసుతనం ఎక్కువ అనే పేరుంది. అయితే.. షూటింగ్ విషయంలో మాత్రం ఇబ్బందిపెట్టరనే పేరు కూడా సంపాదించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement