సాహసాలకు సై! | Sakshi
Sakshi News home page

సాహసాలకు సై!

Published Thu, Oct 8 2015 11:21 PM

సాహసాలకు సై!

బంగీ జంప్ చేయాలంటే గుండెల నిండా దమ్ము కావాలి. స్కై డైవింగ్ చేయాలంటే బోల్డంత ధైర్యం ఉండాలి. ఇక, సీ డైవింగ్ చేయాలంటే హార్ట్ చాలా స్ట్రాంగ్ అయ్యుండాలి. పిరికివాళ్లు ఇవి చేయలేరు. ముఖ్యంగా అమ్మాయిలైతే ‘నా వల్ల కాదు. ఐయామ్ సో సాఫ్ట్ అండి బాబూ’ అని వయ్యారాలు పోతారు. అయితే, కాజల్ అగర్వాల్ వంటి అమ్మాయిలు మాత్రం సాహసాలకు సై అంటారు.

 ఈ బ్యూటీకి ప్రపంచం చుట్టడం అంటే ఇష్టం. వీలు దొరికితే చాలు.. విదేశాలకు చెక్కేస్తారు. ఆ మధ్య ఓసారి బాలీ వెళ్లినప్పుడు కాజల్ సీ డైవింగ్ ట్రై చేశారు. చికాగోలో స్కై డైవింగ్ చేశారు. ‘‘ఎంత ఎగ్జయిటింగ్‌గా అనిపించిందో తెలుసా? రిస్కులో థ్రిల్ ఉంది’’ అంటున్నారు కాజల్. త్వరలో కొత్త సంవత్సరం రానుంది కదా.. షూటింగ్ లేకపోతే విదేశాలు వెళ్లాలనుకుంటున్నారట. ఈసారి ‘వైట్ వాటర్ రాఫ్టింగ్’ ట్రై చేస్తానంటున్నారు కాజల్.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement