మరో స్టార్ హీరోయిన్‌తో బెల్లంకొండ | Kajal Aggarwal Is Going To Pair With Bellamkonda Sai Sreenivas | Sakshi
Sakshi News home page

Mar 27 2018 3:22 PM | Updated on Mar 27 2018 3:30 PM

Kajal Aggarwal Is Going To Pair With Bellamkonda Sai Sreenivas - Sakshi

వరుసగా స్టార్ హీరోయిన్లతో జతకడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాలో సీనియర్‌ తో ఆడిపాడనున్నాడు. ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీనివాస్ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సాక్ష్యం తరువాత చేయబోయే రెండు సినిమాలను ఇప్పటికే  ఫైనల్ చేశాడు శ్రీనివాస్‌. 

కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్‌ స్టార్‌ కాజల్‌ అగర్వాల్‌ ను హీరోయిన్‌ గా ఫైనల్‌ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే  తమన్నా, సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాంటి స్టార్‌ హీరోయిన్లతో నటించిన సాయి శ్రీనివాస్‌ సాక్ష్యం సినిమాలో పూజా హెగ్డేతో జోడి కట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement