రజనీ ఫ్యాన్స్‌కు ధనుష్‌ క్షమాపణలు | Kaala Teaser Postponed Dhanush Apologized | Sakshi
Sakshi News home page

Mar 1 2018 10:36 AM | Updated on Apr 3 2019 9:01 PM

Kaala Teaser Postponed Dhanush Apologized  - Sakshi

హీరో ధనుష​. పక్కన కాలాలో రజనీకాంత్‌

సాక్షి, చెన్నై : సౌతిండియన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు హీరో ధనుష్‌ క్షమాపణలు చెప్పాడు. కాల చిత్ర టీజర్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. 

తొలుత మార్చి 1న టీజర్‌ను విడుదల చేస్తామని కాలా నిర్మాత అయిన ధనుష్‌ అధికారికంగా ప్రకటించాడు. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆయన గౌరవార్థం టీజర్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మరో ట్వీట్‌ చేశాడు. 

మార్చి 2న ఉదయం 11గంటలకు కాలా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ధనుష్‌.. టీజర్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా ఏప్రిల్‌ 27న విడుదల కానుంది. డాన్‌ పాత్రలో రజనీ కనిపించబోతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement