టీచర్‌ పోరాటం | Jyothika New Movie Title Rakshasi | Sakshi
Sakshi News home page

టీచర్‌ పోరాటం

Mar 18 2019 12:30 AM | Updated on Mar 18 2019 12:30 AM

Jyothika New Movie Title Rakshasi - Sakshi

జ్యోతిక

స్కూల్‌ టీచర్‌గా మారారు జ్యోతిక. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత పూర్తి అయ్యిందనుకోలేదు. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయాలని పోరాటం మొదలుపెట్టారు. మరి.. ఆమె పోరాటం ఫలించిందా? అనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్‌ఆర్‌ ప్రభు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎస్‌. రాజ్‌ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో జ్యోతిక స్కూల్‌ టీచర్‌గా నటిస్తున్నారని తెలిసింది.

ఈ సినిమాలో పాత్ర పరంగా విద్యా వ్యవస్థలోని లోటుపాట్లపై ఆమె పోరాటం చేస్తారట. 2003లో వచ్చిన ‘కాక్క కాక్క’  తర్వాత జ్యోతిక టీచర్‌గా నటిస్తున్నది ఇప్పుడే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘రాక్షసి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ‘గులేబకావళి’ ఫేమ్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో జ్యోతిక, రేవతి ముఖ్య పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కనుంది. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement