ఆటకి డేట్‌ షురూ | Jersey movie released on april 19 | Sakshi
Sakshi News home page

ఆటకి డేట్‌ షురూ

Mar 12 2019 2:42 AM | Updated on Mar 12 2019 2:42 AM

Jersey movie released on april 19 - Sakshi

నాని

ముప్పై ఆరు సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్‌ అనే క్రికెటర్‌ కథతో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ చిత్రం నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉంది.

‘జెర్సీ’ అని టైటిల్‌ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి ఈ సినిమా ఇంత సక్సెస్‌ఫుల్‌గా రావడానికి కారణమైన నానిగారికి, అన్నివిధాలుగా సహకరించిన నాగవంశీగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘జెర్సీ’ సినిమా మా బేనర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అని నాగవంశీ అన్నారు. సత్యరాజ్, రోనిత్‌ కమ్ర, రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్‌ శర్మ, సంపత్, ప్రవీణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్‌ రవిచందర్, కెమెరా: సాను జాన్‌ వర్గీస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకట్‌ రత్నం (వెంకట్‌), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement