సూపర్‌ బ్యాలెన్స్‌ | Jayam Ravi to romance Taapsee Pannu | Sakshi
Sakshi News home page

సూపర్‌ బ్యాలెన్స్‌

May 12 2019 3:48 AM | Updated on May 12 2019 3:48 AM

Jayam Ravi to romance Taapsee Pannu - Sakshi

తాప్సీ

సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్‌ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో జోరుమీదున్నారు. సినిమా వెంట సినిమాను జెట్‌ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారామె. ఇటీవల ‘సాండ్‌ కీ అంఖే’ అనే సినిమాను పూర్తి చేశారు. బాలీవుడ్‌లో తాప్సీ బిజీగా ఉన్నా సౌత్‌ను నెగ్లెట్‌ చేయడం లేదు. సౌత్‌లో 2017లో ‘ఆనందో బ్రహ్మ’, 2018 ‘నీవెవరో’ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది ‘గేమ్‌ ఓవర్‌’ అనే బైలింగ్వల్‌ (తెలుగు, తమిళం) సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు.

ఈ చిత్రం హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ను దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ బాలీవుడ్‌లో రిలీజ్‌ చేయనున్నారు. మరి.. ఈ ఏడాది తాప్సీ నటించబోయే సౌత్‌ సినిమా ఏంటి? అనేగా మీ డౌట్‌. ఆమె ఓ తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కోలీవుడ్‌ టాక్‌. ‘జయం’ రవి హీరోగా అహ్మద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కథ పరంగా ఇద్దరు హీరోయిన్స్‌కు చోటుందట. ఒక హీరోయిన్‌ పాత్ర కోసం తాప్సీని సంప్రదించి, అహ్మద్‌ కథ వినిపించడంతో ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ఇలా సౌత్, నార్త్‌ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ కెరీర్‌ను సూపర్‌ బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు తాప్సీ.

Advertisement
 
Advertisement
Advertisement