మనస్ఫూర్తిగా నచ్చి చేశా... | Impressed have wholeheartedly ... | Sakshi
Sakshi News home page

మనస్ఫూర్తిగా నచ్చి చేశా...

Oct 18 2014 1:11 AM | Updated on Aug 9 2018 7:28 PM

మనస్ఫూర్తిగా నచ్చి చేశా... - Sakshi

మనస్ఫూర్తిగా నచ్చి చేశా...

‘‘ఇటీవల సినిమాలు చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. పెద్ద తరహా పాత్రలు చేయమని చాలామంది అడుగుతున్నా, ఆ తరహా సినిమాల్లో నటించి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకోవడంలేదు.

‘‘ఇటీవల సినిమాలు చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. పెద్ద తరహా పాత్రలు చేయమని చాలామంది అడుగుతున్నా, ఆ తరహా సినిమాల్లో నటించి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకోవడంలేదు. పూసల చెప్పిన కథ నచ్చి, మనస్ఫూర్తిగా నా పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా’’ అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబీ శ్రీక్రితి సమర్పణలో సత్యం నిర్మించిన ‘డాలర్‌కి మరో వైపు’ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

పూసల మాట్లాడుతూ -‘‘ఈ తరం వారికి అమెరికాపై ఉన్న మోజు, డాలర్లకు బానిసలవ్వడం, ఉమ్మడి కుటుంబంలోని ప్రేమానురాగాలు కరువవ్వడం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. నవంబరు మొదటి వారంలో పాటలను, అదే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా యశ్వంత్, మిత్ర, సందీప్తి తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement