హాలీడేస్‌ను హ్యాపీ డేస్‌ గా గడిపేస్తున్న హన్సిక | Sakshi
Sakshi News home page

హాలీడేస్‌ను హ్యాపీ డేస్‌ గా గడిపేస్తున్న హన్సిక

Published Tue, Jul 29 2014 11:25 PM

హాలీడేస్‌ను హ్యాపీ డేస్‌ గా గడిపేస్తున్న హన్సిక - Sakshi

హాలీడే అంటే ఎవరికైనా జాలీడేనే. సెలవులొస్తున్నాయంటే ముందుగానే ఎలా ఎంజాయ్ చేయూలన్న ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అలానే హన్సిక కూడా తనకు దొరికిన సమయూన్ని హ్యాపీడేస్‌గా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. హన్సిక క్షణం తీరిక లేనంత బిజీ హీరోయిన్. తమిళం, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. తమిళంలో అరణ్మణై, వాలు, ఉయిరే ఉయిరే, మెగా మెన్, రోమియో జూలియట్ తదితర చిత్రాలతోపాటు తెలుగుతో కలిసి అరడజను చిత్రాలకు పైగా చేస్తూ యమబిజీగా ఉన్నారు. మరో పక్క అనాథ బాలల దత్తత, ఇతర సేవా కార్యక్రమాలతో జన్మను సార్థకత చేసుకుంటున్నారు. హన్సిక చిన్న తనంలోనే చిత్ర రంగ ప్రవేశం చేయడంతో బాల్యానుభవాన్ని చాలా కోల్పోయారని ఆమే స్వయంగా వెల్లడించారు.
 
 చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ అంటూ సగ జీవితాన్ని విమాన యానంలోనే గడిపేస్తున్న హన్సిక కాస్త విశ్రాంతి కోరుకున్నారు. కొద్ది రోజులు కెమెరా, యాక్షన్ అనే మాటలకు దూరంగా ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని తన బాల్య స్నేహితులతో, విదేశీయానానికి పయనమయ్యారు. ప్రస్తుతం యూరప్ దేశాలను చుట్టేస్తున్నారు. ఆమ్‌స్టర్‌డామ్, బర్సిలునా, లిబిజా దేశాల్లో పర్యటించారు. తన విదేశీయానం గురించి హన్సిక తన ట్విట్టర్‌లో పేర్కొంటూ షూటింగ్‌ల నుంచి కాస్త విరామం తీసుకుని ఈ హాలీడేస్‌ను హ్యాపీ డేస్‌గా గడిపేస్తున్నానన్నారు. మనసు ఆనందంతో తేలిపోతోందన్నారు. అన్నట్టు తన జుట్టుకు పింక్ కలర్ వేసుకుని చాలా కొత్తగా కనిపిస్తున్నానని హన్సిక పేర్కొన్నారు.

Advertisement
Advertisement