'నేను నరేంద్ర మోదీ కూతుర్ని' | 'I am Narendra Modi's daughter' | Sakshi
Sakshi News home page

'నేను నరేంద్ర మోదీ కూతుర్ని'

Sep 16 2015 4:02 PM | Updated on Aug 21 2018 9:36 PM

'నేను నరేంద్ర మోదీ కూతుర్ని' - Sakshi

'నేను నరేంద్ర మోదీ కూతుర్ని'

'కేలండర్ గాల్స్' సినిమాతో బాలీవుడ్ లో తెరంగ్రేటం చేస్తున్న ఈ అందాల భామ ఆసక్తికర వ్యాఖ్యలతో అందరిచూపు తనపైపు తిప్పుకుంది.

హీరోయిన్లు కామ్నా జెఠ్మలానీ, కియరా అద్వానీ తమ ఇంటిపేర్లతో గుర్తింపు పొందారు. హాట్ మోడల్ అవని మోదీ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 'కేలండర్ గాల్స్' సినిమాతో బాలీవుడ్ లో తెరంగ్రేటం చేస్తున్న ఈ అందాల భామ ఆసక్తికర వ్యాఖ్యలతో అందరిచూపు తనపైపు తిప్పుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ మీకు బంధువా అని ఓ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించగా... 'అవును, నేను నరేంద్ర మోదీ కూతుర్ని' అంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది. అక్కడితో ఆగకుండా..  'నేనే కాదు దేశంలోని ఆడపిల్లలందరూ మోదీసాబ్ కూతుళ్లే. అందరికీ ఆయన తండ్రిలాంటి వారు. ఆయన నికార్సైన నాయకుడు, స్ఫూర్తిప్రదాత' అంటూ పొగిడేసింది.

అవని సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో మోదీకి ఆమె ఎమైనా బంధువు అవుతుందా అనే సందేహం కలిగింది. అయితే మోదీకి తాను బంధువును కాదని పరోక్షంగా వెల్లడించింది. అవని నటించిన 'కేలండర్ గాల్స్' సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement