‘ఆత్మలు డ్యాన్స్‌ చేయాల్సిందే’ | Hrithik Roshan Shares 3 Videos On His Parents Wedding Anniversary | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ స్పీరిట్: లవ్‌ యూ మమ్మ, పప్పా’

Apr 23 2020 8:21 PM | Updated on Apr 23 2020 8:27 PM

Hrithik Roshan Shares 3 Videos On His Parents Wedding Anniversary - Sakshi

హీరో హృతిక్‌ రోషన్‌ తన మాజీ భార్య సుసానే ఖాన్‌తో కలిసి తన తల్లిదండ్రులు రాకేష్‌ రోషన్, పింకి రోషన్‌లకు వివాహ వార్షిక శుభకాంక్షలు తెలిపుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో గురువారం షేర్‌ చేశాడు. కాగా బుధవారం(ఏప్రీల్‌ 22) రాకేష్‌, పింకి రోషన్‌ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హృతిక్‌ తన ఇద్దరూ కూమారులు, మాజీ భార్యతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మూడు వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘బయట ఉన్నప్పటీకీ, క్వారంటైన్‌లో ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మన ఆత్మలు డ్యాన్స్‌ చేయాల్సిందే..! హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్పా, లవ్‌ యూ’ అనే క్యాప్షన్‌కు ‘‘ఫ్యామిలీ స్పీరిట్‌’’  అనే హ్యాష్‌ ట్యాగ్‌కు జత చేసి షేర్‌ చేశాడు. (వైరస్‌ భయపడుతుంది!)

కాగా ఓ వీడియోలో  హృతిక్‌ పియానో వాయిస్తుంటే తన ఇద్దరూ కూమారులు హ్రేహాన్‌, హ్రిధాన్‌లతో పాటు మాజీ భార్య సుసానే శుభాకాంక్షలు తెలుపుతూ పాట పాడుతున్నారు. కాగా మరో వీడియోలో హృతిక్‌ తల్లిదండ్రులు రాకేష్‌, పింకి రోషన్‌లు కేక్‌ కట్‌ చేస్తుంటే కుటుంబ సభ‍్యులంతా వీడియో కాల్‌లో శుభకాంక్షలు తెలుపుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే చిన్నప్పటీ నుంచి మంచి స్నేహితులైన హృతిక్‌, సుసానేలు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. కాగా ఓ స్టార్‌ హీరోయిన్‌ వల్ల వీరీ వివాహ బంధంలో కలతలు రావడంతో  విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో వారిద్దరు 2014లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉంటున్న ఈ మాజీ దంపతులు లాక్‌డౌన్‌లో ఒకే ఇంట్లో తమ ఇద్దరూ కుమారులతో కలిసి క్వారంటైన్‌లో ఉండటం గమనార్హం. (కరోనా: స్టార్‌ హీరో ఇంటికి చేరిన మాజీ భార్య)

Advertisement
 
Advertisement
Advertisement