అందరికీ థ్యాంక్స్‌ : హీరో నాని | Hero nani says thanks to cinema critics | Sakshi
Sakshi News home page

అ! విజయంపై స్పందించిన హీరో నాని

Feb 17 2018 1:01 PM | Updated on Aug 9 2018 7:28 PM

Hero nani says thanks to cinema critics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమా ఫిబ్రవరి 16న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు సినీ అభిమానులు సైతం సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. దీంతో నిర్మాత నాని సినిమా విజయవంతం చేసినందుకు సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై నిర్మాత నానీ కూడ స్పందించారు.

ఈ సందర్భంగా సినీ విశ్లేషకులతో పాటు సినీ అభిమానులకు నాని ధన్యవాదాలు తెలిపారు. పలు వెబ్‌సైట్లు అ! సినిమాకు ఇచ్చిన రేటింగ్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందరికీ థ్యాంక్స్‌ అంటూ తన వాల్‌పై రాసుకొచ్చాడు. ఈ సినిమాతో ప్రశాంత్‌ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కొత్త తరహ కథ కావడంతో 'అ!' సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement