బికినీ వేస్తే తప్పేంటి? | Hate Story 2 not an ideal debut film: Surveen Chawla | Sakshi
Sakshi News home page

బికినీ వేస్తే తప్పేంటి?

Jul 25 2014 12:11 AM | Updated on Sep 2 2017 10:49 AM

బికినీ వేస్తే తప్పేంటి?

బికినీ వేస్తే తప్పేంటి?

బికినీ దుస్తులు ధరించడానికి అభ్యంతరం ఏముందంటోంది ఉత్తరాది భామ సుర్విన్ చావ్లా. కోలీవుడ్‌లో మూండ్రు పేర్ మూండ్రు కాదల్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ పుదియ

 బికినీ దుస్తులు ధరించడానికి అభ్యంతరం ఏముందంటోంది ఉత్తరాది భామ సుర్విన్ చావ్లా. కోలీవుడ్‌లో మూండ్రు పేర్ మూండ్రు కాదల్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ పుదియ తిరుప్పంగళ్ చిత్రంలో నటించారు. తాజాగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న జైహింద్-2 లో హీరోయిన్ ఈ అమ్మడే. బాలీవుడ్‌లో హిమ్మత్ వాలా చిత్రంలో చిన్న వేషంలో మెరిసిన సుర్విన్ చావ్లా ప్రస్తుతం దక్షిణాది చిత్రాలనే నమ్ముకుందట. దీని గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ అర్జున్ జైహింద్-2 చిత్రంలో హీరోయిన్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పింది.
 
 ఈ చిత్రం తన నటనకు కచ్చితంగా ప్రశంసలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే తెరపైకొచ్చిన హేట్ స్టోరీ - 2 చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో హీరో జైతో సన్నిహిత సన్నివేశాల్లో నటించడం గురించి అడుగుతున్నారని, అయితే నటుడు జై తనకు ఇంతకు ముందే తెలుసునని అందువల్ల రొమాన్స్ సన్నివేశాల్లో పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పింది. అలాంటి సన్నివేశాల్లో బికినీ దుస్తులు ధరించి నటించడానికి సంకోచించలేదని చెప్పింది. కథలో అది ఒక భాగం అవడంతో బికినీ దుస్తులు ధరించడానికి నో చెప్పలేదని, అయినా అందులో తప్పేముందని సుర్విన్ చావ్లా అంటోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement