పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన హ‌న్సిక‌ | Hansika Condems On Marriage Rumours | Sakshi
Sakshi News home page

'నా పెళ్లి విష‌యం నాకూ ఇప్పుడే తెలిసింది'

Jun 11 2020 4:59 PM | Updated on Jun 11 2020 6:29 PM

Hansika Condems On Marriage Rumours - Sakshi

టాలీవుడ్ హీరోయిన్ హ‌న్సిక ప్ర‌స్తుతం 'మ‌హా' సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రియుడు శింబు అతిథిగా న‌టిస్తున్నాడు. ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడితే లాక్‌డౌన్‌లో వ్య‌క్తిగ‌త భాగ‌స్వామిని వెతుక్కుంటూ పెళ్లి బాజాలు మోగిస్తున్నారు కొంత‌మంది సెల‌బ్రిటీలు. ఈ నేప‌థ్యంలో తాజాగా హ‌న్సిక కూడా పెళ్లికి సిద్ధ‌మైపోయింద‌హో అంటూ ప్రచారం ఊపందుకుంది. ఓ వ్యాపార‌వేత్త‌తో మెడ‌లో మూడు ముళ్లు వేయించుకోనుంద‌ని ఈ వార్త‌ సారాంశం. ఈ గుస‌గుస‌లు కాస్తా హ‌‌న్సిక చెవిలోనూ ప‌డింది.( వేసవిలో భయపెడతా)

దీంతో ఆమె ఒక్క‌సారిగా న‌వ్వేస్తూ.. "ఇంత‌కీ నేను పెళ్లి చేసుకునే ఆ వ్యాపార‌వేత్త ఎవ‌రో నాకూ చెప్ప‌కూడ‌దూ.." అని వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చింది. ఇక హ‌న్సిక పెళ్లికూతురు కాబోతోందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఆమె అభిమాని ఒక‌రు బాగా హ‌ర్ట్ అయ్యాడు. "ఈ విష‌యం నాకు చెప్ప‌నే లేదే.." అని కామెంట్ చేశాడు. దీనికి స‌ద‌రు హీరోయిన్‌ "ఏం చేయ‌ను.. నాకు కూడా ఇప్పుడే తెలిసింది" అంటూ ఫ‌న్నీ రిప్లై ఇచ్చింది. కాగా ఈ ముద్దుగుమ్మ సంచ‌ల‌న న‌టుడు శింబుతో గ‌తంలో ప్రేమాయ‌ణం సాగించిన విష‌యం తెలిసిందే. (మాజీ ప్రియురాలితో..)

Advertisement
 
Advertisement
Advertisement