అవన్నీ వదంతులే : గుత్తా జ్వాల | Gutta Jwala Clarifies Not Contesting In Bigboss Show | Sakshi
Sakshi News home page

అవన్నీ వదంతులే : గుత్తా జ్వాల

May 26 2019 2:28 PM | Updated on Jul 18 2019 1:41 PM

Gutta Jwala Clarifies Not Contesting In Bigboss Show - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ 3లో తాను పాల్గొంటానని వచ్చిన వార్తలను బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల తోసిపుచ్చారు. నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న బిగ్‌బాస్‌ 3లో తాను పార్టిసిపేట్‌ చేస్తున్నట్టు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని ఆమె ట్విటర్‌ వేదికగా కొట్టిపారేశారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి, హీరో వరుణ్‌ సందేశ్‌, ఆర్జే హేమంత్‌ తదితరులు పాల్గొంటారని తెలిసింది. ఇక బిగ్‌బాస్‌ సిరీస్‌లో తొలి రెండు షోలు విజయవంతం కావడంతో మూడవ సీజన్‌ను ఎవరు హోస్ట్‌ చేస్తారు, పార్టిసిపెంట్స్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement