మోడ్రన్‌ గుండమ్మ 

Gundamma Katha Movie Official Trailer Released - Sakshi

ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు– లక్ష్మీ శ్రీవాత్సవ దర్శక ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘గుండమ్మకథ’ (2020). ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘అలనాటి ‘గుండమ్మకథ’ చిత్రం తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ స్ఫూర్తితో ఈ మోడ్రన్‌ గుండమ్మకథను రెడీ చేశాం. లవ్, కామెడీ, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఉన్న లక్ష్మీ శ్రీవాత్సవ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ కూడా అందించారు. ‘గెటప్‌’ శ్రీను, భాష తదితరులు నటించిన ఈ సినిమాకు మోనీష్‌ భూపతి సంగీతం అందించారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top