చిరు బర్త్‌డేకి గ్యాంగ్‌లీడర్‌ | gang leader released on august 22 | Sakshi
Sakshi News home page

చిరు బర్త్‌డేకి గ్యాంగ్‌లీడర్‌

Jun 8 2019 2:44 AM | Updated on Jun 8 2019 2:44 AM

gang leader released on august 22 - Sakshi

మోహన్‌ కృష్ణ

మోహన్‌ కృష్ణ, హరిణి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. సిహెచ్‌ కిషోర్‌బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్‌రావు నిర్మిస్తున్నారు. కిషోర్‌ రాఠీ, మహేష్‌ రాఠీ సమర్పకులు. చిత్ర హీరో మోహన్‌కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మోషన్‌ పోస్టర్‌ లను రిలీజ్‌ చేస్తున్నారు.‘‘నా అభిమాన హీరో చిరంజీవిగారి పుట్టిన రోజు ఆగస్టు 22న మా సినిమా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని మోహన్‌కృష్ణ అన్నారు. ‘‘చిరంజీవిగారి సినిమా టైటిల్‌ పెట్టడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు సిహెచ్‌ కిషోర్‌ బాబు. ‘‘సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. టీమ్‌ చాలా కష్టపడుతున్నారు’’ అన్నారు సింగులూరి మోహన్‌రావు.

Advertisement
 
Advertisement
Advertisement