ఐదుగురు మోడల్స్ కథ! | five Models story | Sakshi
Sakshi News home page

ఐదుగురు మోడల్స్ కథ!

Jul 15 2015 11:26 PM | Updated on Apr 4 2019 5:25 PM

ఐదుగురు మోడల్స్ కథ! - Sakshi

ఐదుగురు మోడల్స్ కథ!

కథలు ఎక్కడో పుట్టవ్. మన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే చాలని నమ్ముతారు హిందీ దర్శకుడు మధుర్ భండార్కర్. సహజత్వానికి

కథలు ఎక్కడో పుట్టవ్. మన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే చాలని నమ్ముతారు హిందీ దర్శకుడు మధుర్ భండార్కర్. సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు రూపొందించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ‘చాందినీ బార్’, ‘పేజ్ 3’, ‘కార్పొరేట్’, ‘హీరోయిన్’ ...ఇలా ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సమాజంలోని పాత్రలే కనిపిస్తాయి. తాజాగా, మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘క్యాలెండర్ గాళ్స్’.
 
  ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త - మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గెటప్ నుంచి మధుర్ ప్రేరణ పొందారనిపిస్తోంది. ఎందుకంటే, ప్రచార చిత్రంలో ఉన్న పాత్రధారి వేషం అచ్చంగా విజయ్ మాల్యానే గుర్తుకు తెస్తోంది. ఈ పాత్రను సుహేల్ సేథ్ పోషిస్తున్నారు. ఒక ప్రముఖ క్యాలెండర్‌కి మోడలింగ్ చేయడంద్వారా ఐదుగురు మోడల్స్ ఎంత ప్రాచుర్యం సంపాదించుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఐదుగురు మోడల్స్‌గా ఆకాంక్షా  పురి, అవనీ మోది, కైరా దత్, రూహీ సింగ్, సతరూపా ప్యానె నటిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement