‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’ | Fan Asked Shah Rukh Khan To About Signing For Dhoom 4 Movie | Sakshi
Sakshi News home page

‘అది నా కోరిక కూడా.. ఇంకా వివరాలు వస్తే చెప్పండి’

Oct 9 2019 1:09 PM | Updated on Oct 9 2019 2:10 PM

Fan Asked Shah Rukh Khan To About Signing For Dhoom 4 Movie - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జీరో’ సినిమా  గత ఏడాది విడుదలై  బాక్సాఫీస్‌ వద్ద బొల్తాకొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతోన్నా కింగ్‌ఖాన్‌ మళ్లీ థియేటర్‌లలో కనిపించనేలేదు. దీంతో ఈ రేస్‌ యాక్టర్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? అనే ప్రస్తావన రాగానే ‘రాజ్‌కుమార్‌ హిరాని నుంచి అబ్బాస్‌ జాఫర్‌లతో పాటు మరో ప్రముఖ దర్శకుల సినిమాలకు షారుక్‌ సైన్‌ చేశారు’ అనే వార్తలు సోషల్‌ మీడియాల్లో షికార్లు చేస్తున్నాయి.

అయితే వాటన్నింటికి కింగ్‌ ఖాన్‌ ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. ‘ప్రస్తుతానికి నేను ఏ సినిమాలకు సైన్‌  చేయలేదని’ ట్వీట్‌ చేశాడు. ఇటీవల ట్విటర్‌లో షారుక్‌ నిర్వహించిన ‘ఆస్క్‌ షారుక్‌ఖాన్‌’ సెషన్‌లో బాద్‌షాను   ‘మీరు ధూమ్‌ 4 సినిమాకు సంతకం చేశారా?’ అని ఓ అభిమాని అడిగాడు. దానికి కింగ్‌ఖాన్‌  ‘ఇది నేను కూడా విన్నాను... నాకు ఆ సినిమాలో నటించాలనే ఉంది, దీనిపై ఇంకేమైన  వివరాలు వస్తే నాకు తెలపండి’ అంటూ సరదాగా బదులిచ్చారు. 

కాగా షారుక్‌ ఖాన్‌ను తన అభిమానులు డిడిఎల్‌జేలో రాహుల్‌గా ప్రేమించారు. అలాగే డర్‌, అంజమ్‌, బాజిగర్‌లతో పాటు డాన్‌ వంటి చిత్రాలలో ప్రతినాయక పాత్రలో కూడా షారుక్‌ మెప్పించాడు. దీంతో యశ్‌రాజ్‌ ‘ధూమ్‌’ సిరీస్‌లో విలన్‌లుగా నటించిన హీరోలు ఆమిర్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, జాన్‌ అబ్రహంల సరసన కింగ్‌ ఖాన్‌ చేరతాడా లేదో  మరి వేచిచూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement