యూత్‌కి థ్రిల్‌ | eureka telugu movie audio launch shortly | Sakshi
Sakshi News home page

యూత్‌కి థ్రిల్‌

Jun 14 2019 1:52 AM | Updated on Jun 14 2019 1:52 AM

eureka telugu movie audio launch shortly - Sakshi

కార్తీక్‌ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘యురేక’. లక్ష్మీ ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కార్తీక్‌ ఆనంద్‌ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు తదితరులు నటించిన ఈ సినిమాకి సహ నిర్మాత: లలితకుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్‌ కుమరన్, కెమెరా: ఎన్‌.బి. విశ్వకాంత్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.ఆర్‌.ఎస్‌.టి.సాయి. 

Advertisement
 
Advertisement
Advertisement