లవ్‌ థ్రిల్లర్‌ | Eureka Movie First Look Motion Poster Released | Sakshi
Sakshi News home page

లవ్‌ థ్రిల్లర్‌

Mar 25 2019 1:58 AM | Updated on Mar 25 2019 1:58 AM

Eureka Movie First Look Motion Poster Released - Sakshi

‘యురేక’ ఫస్ట్‌ లుక్‌

కార్తీక్‌ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వంలో లక్ష్మి ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మించారు. లలితకుమారి బొడ్డుచర్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఇంజనీరింగ్‌ కాలేజ్‌ నేపథ్యంలో లవ్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎంతో ఇంటెన్సివ్‌గా ఉండి, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్‌ రాఘవ తదితరులు నటించిన ఆ చిత్రానికి సంగీతం: నరేష్‌ కుమరన్, కెమెరా: ఎన్‌.బి. విశ్వకాంత్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.ఆర్‌.ఎస్‌.టి.సాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement