రెండో సీఎంకి నా ఛాయిస్‌ ఆయనే! | Director Shankar Interesting Comments on Actor Vijay | Sakshi
Sakshi News home page

Dec 10 2018 8:40 PM | Updated on Apr 3 2019 8:57 PM

Director Shankar Interesting Comments on Actor Vijay - Sakshi

సాక్షి, తమిళసినిమా: స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన సూపర్‌హిట్‌ సినిమాలకు వరుసగా సీక్వెల్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే రోబో సీక్వెల్‌ 2.ఓ వచ్చింది. త్వరలో భారతీయుడు సీక్వెల్‌ కూడా రాబోతోంది. మరి ‘ఒకే ఒక్కడు’ సినిమాకు కూడా సీక్వెల్‌ వస్తే.. అందులో ముఖ్యమంత్రి పాత్ర ఎవరు పోషిస్తారంటే.. ‘నా ఫస్ట్‌ ఛాయిస్‌ విజయ్‌నే’ అంటున్నారు శంకర్‌.

ఆయన తాజా చిత్రం ‘2.ఓ’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక‌్షన్లను కొల్లగొడుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమా కథానాయకుడు రజనీకాంత్‌ ఆదివారం రాత్రి తన తాజా చిత్రం పేట ఆడియో ఆవిష్కరణ  సందర్భగా స్వయంగా చెప్పారు. దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ఇండియన్‌- 2 చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శంకర్‌.. మీ తదుపరి చిత్రం ఏంటన్న ప్రశ్నకు ముదల్వర్‌ (ఒకే ఒక్కడు) చిత్రానికి సీక్వెల్‌ చేసే ఆలోచన ఉందని తెలిపారు. ముదల్వర్‌ చిత్రాన్ని శంకర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.

ముదల్వర్‌- 2లో హీరోగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్న ప్రశ్నకు రజనీ, కమల్‌లలో ఒకరు నటించడానికి సిద్ధమంటే వారితోనే చేస్తానన్నారు. అయితే, స్క్రిప్ట్‌ యువ హీరోను డిమాండ్‌ చేస్తే తన ఫస్ట్‌ ఛాయిస్‌ ఇళయదళపతి విజయ్‌నేనని చెప్పారు. ఇండియన్‌- 2 చిత్రం పూర్తయిన తరువాతనే ముదల్వర్‌- 2 గురించి చర్చిస్తానని తెలిపారు. కాగా ఇంతకుముందు శంకర్, విజయ్‌ల కాంబినేషన్‌లో నన్భన్‌ (స్నేహితుడు) చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement