వ్యూహాలు ఫలించాయా? | dandupalyam 4 movie release date fix | Sakshi
Sakshi News home page

వ్యూహాలు ఫలించాయా?

Jul 23 2019 4:11 AM | Updated on Jul 23 2019 4:11 AM

dandupalyam 4 movie release date fix - Sakshi

కేటీ నాయక్‌, వెంకట్

సుమన్‌ రంగనాథన్, ముమైత్‌ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌కుమార్‌ ముఖ్య తారలుగా కేటీ నాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్‌ నటించారు. ప్రస్తుతం సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగస్టు 15న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 1,2’ చిత్రాలకు మా సినిమాకి సంబంధం లేదు. ఇందులో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు కె.టి.నాయక్‌.

Advertisement
 
Advertisement
Advertisement