ఇరగ.. ఇరగ.. ఇంప్రెస్‌ | Chiranjeevi visits Allu Arjun on the sets of ‘Naa Peru Surya’ | Sakshi
Sakshi News home page

ఇరగ.. ఇరగ.. ఇంప్రెస్‌

Apr 16 2018 12:45 AM | Updated on Apr 16 2018 12:45 AM

Chiranjeevi visits Allu Arjun on the sets of ‘Naa Peru Surya’ - Sakshi

వక్కంతం వంశీ, అల్లు అరవింద్, అనూ ఇమ్మాన్యూయేల్, చిరంజీవి, అల్లు అర్జున్‌

మాములుగానే బన్నీ డ్యాన్స్‌ అదుర్స్‌. థియేటర్‌లో ఆడియన్స్‌ విజిల్స్‌. వన్స్‌ మోర్‌ కేకల్స్‌. అలాంటిది డ్యాన్స్‌లో తనకు ఇన్‌స్పిరేషన్‌గా ఉండే చిరంజీవి ఎదురుగా ఉంటే...బన్నీ ఆగుతాడా? ఇంకాస్త రెచ్చిపోడు. అలాగే రెచ్చిపోయి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ‘ఇరగ.. ఇరగ...’ సాంగ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసి చిరంజీవిని ఇంప్రెస్‌ చేశాడట. అల్లు అర్జున్‌ (బన్నీ) హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’.

అనూ ఇమ్మాన్యూయేల్‌ కథానాయిక. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ‘‘సెట్స్‌కి చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. బన్నీ డ్యాన్స్‌ చేస్తున్నంత సేపు చిరంజీవిగారు ఎంజాయ్‌ చేశారు. సాంగ్‌ బాగుందని మెచ్చుకున్నారు. సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 22న ఆడియో వేడుకను, 29న హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ను జరపనున్నాం. సినిమాను మే 4న రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement