‘96’ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారా?

Casting Call For Young Sharwanand Role In 96 Remake - Sakshi

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ తమిళనాట రికార్డులు సృష్టించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించవలసిందిగా.. చిత్రయూనిట్‌ ప్రకటించింది. 

96 మూవీలో స్కూల్‌ ఏజ్‌లో ఉండే లవ్‌ స్టోరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. తమిళ్‌లో ఆ పాత్రలు చేసినవారికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ కథను తెలుగులో స్కూల్‌ లేదా కాలేజ్‌కు మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శర్వానంద్‌ చిన్నప్పటి పాత్రకు సంబంధించి ఆడిషన్స్‌ జరుపుతున్నట్టు.. ఆసక్తి కలవారు తమను సంప్రదించండి అంటూ మేకర్స్‌ ప్రకటించారు. మరి నటనలో ఆసక్తి ఉన్న వారు ఆలస్యం చేయకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top