విడిపోవడం మంచికే!

Break-up With Ranbir Kapoor Was A Blessings - Sakshi

ఈ ఏడాది బాలీవుడ్‌లో పెళ్లి బాజా బాగా మోగింది. అనుష్కాశర్మ–విరాట్‌ కోహ్లీ, నేహాధూపియా–అంగద్‌ బేడీ, సోనమ్‌ కపూర్‌–ఆనంద్‌ అహూజా, దీపికా పదుకోన్‌–రణ్‌వీర్‌ సింగ్‌ తాజాగా ప్రియాంకా చోప్రా–నిక్‌ జోనస్‌ ఈ సంవత్సరం ఏడడుగులు వేశారు. మరికొన్ని జంటలు పెళ్లికి రెడీ అవుతున్నాయి. తోటి కథానాయికలందరూ పెళ్లిచేసుకుని ఒక ఇంటివారు అవుతున్నారు. మీ పెళ్లి ఎప్పుడు? అని కత్రినా కైఫ్‌ని అడిగితే.. ‘‘పెళ్లి గురించిన ఆలోచన ఉంది. కానీ ఎందుకో వర్కౌట్‌ కావడం లేదు. నీ లైఫ్‌లో నువ్వు నిర్మించుకున్న దారిలో వెళ్లాల్సిందే. అందుకే పెళ్లి గురించి పెద్దగా ఒత్తిడికి లోనవ్వాలని అనుకోవడం లేదు. కొన్ని విషయాలు నేను అనుకున్నట్లు జరగలేదు. సమయం కలిసొచ్చినప్పుడు పెళ్లి కబురు చెబుతా’’ అని పేర్కొన్నారు. ఇక రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ– ‘‘అతన్నుంచి విడిపోవడం నా మంచికే జరిగింది’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top