టి ఫర్‌ టెర్రర్‌

Birthday Special! Trisha Krishnan: Lesser known facts of the actress - Sakshi

‘టి’ అంటే త్రిష. అయితే ‘టి’ ఫర్‌ వేరే అంటున్నారు త్రిష. ‘టెర్రర్‌’ అట. స్కూల్‌ డేస్‌లో త్రిషకు ఆమె ఫ్రెండ్స్‌ పెట్టిన నిక్‌ నేమ్‌ ఇది. దాన్నిబట్టి త్రిష ఎంత హైపర్‌ యాక్టివ్‌గా ఉండేవారో ఊహించవచ్చు. శుక్రవారం త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కి ఓ గోల్డెన్‌ చాన్స్‌ ఇచ్చారు. ట్వీటర్‌లో అభిమానులతో చిట్‌ చాట్‌ చేశారు త్రిష. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు స్వీట్‌ అండ్‌ షార్ట్‌గా సమాధానాలు చెప్పారు.

మీ బలం?
ఆత్మవిశ్వాసం.

డైరెక్టర్‌ అవ్వాలని ఉందా?
లేదు.

ఆనందం లేదా బాధగా ఉన్నప్పుడు వెళ్లాలనుకునే ప్లేస్‌?
న్యూయార్క్‌.

స్కూల్‌లో మీ నిక్‌ నేమ్‌?
టెర్రర్‌.

మీలా లైఫ్‌లో ముందుకు వెళ్లాలంటే మోటివేషన్‌ ఎక్కడినుంచి దొరుకుతుంది?
మీలోనే ఉంది.

మోస్ట్‌ ఫేవరెట్‌ మూవీ ?
ఒక్కటి కాదు.. చాలా ఉన్నాయి.

బర్త్‌డే సెలబ్రేషన్‌కి ప్రియారిటీ ప్లేస్‌?
బీచ్‌.

ఫుడ్‌ ఆర్‌ షాపింగ్‌?
షాపింగ్‌ అంతగా నచ్చదు. 

భోజనప్రియుల కోసం ఒక మాట చెప్పండి?
నేను తినడం కోసమే బతుకుతున్నా. ద బెస్ట్‌ పీపుల్‌ ఆర్‌ ఫుడ్‌ పీపుల్‌.

లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ఎక్కువగా ఏం చేస్తుంటారు?
వాకింగ్‌ అండ్‌ ఈటింగ్‌.

నిద్రలేచిన వెంటనే ఏం చేస్తారు?
ఫోన్‌ చెకింగ్‌.

ఫేవరెట్‌ హాలిడే స్పాట్‌?
న్యూయార్క్‌.

టీవీ ఆర్‌ ఫోన్‌?
ఫోన్‌లోనే టీవీ వస్తుంది. సో.. ఫోన్‌ ఇష్టం.

మీ పెళ్లెప్పుడు? మీరు నాకన్నా కేవలం పది సంవత్సరాలే పెద్దవారు. నన్ను పెళ్లాడతారా?
మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే (నవ్వుతూ).

మీ బెస్ట్‌ క్రిటిక్‌?
నేనే.

రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఏదైనా ఉందా?
ప్రస్తుతానికి లేదు.

వంట వచ్చా?
అప్పుడప్పుడు ప్రయత్నిస్తాను.

మీరు కొత్తగా ఏదైనా సినిమాకు సైన్‌ చేశారా?
యస్‌.. చేశాను. త్వరలో ఆ విషయాలు చెబుతా.

తెలుగులో ఎప్పుడు సినిమాలు చేస్తారు?
వెయిట్‌ చేయండి. తప్పకుండా ప్రకటిస్తాను.

నిద్రలో నడిచే అలవాటు ఉందా?
లేదు. కానీ ఎవర్నైనా సరదాగా ఆటపట్టించాలని అలా ట్రై చేస్తాను.

ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌లో ఉండాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలనే మాటలో నిజం ఉందా?
అవసరం లేదు. నిజానికి నా సినిమా జర్నీలో నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.

ఎటువంటి బుక్స్‌ చదువుతారు?
మిస్టరీ, థ్రిల్లర్స్, హారర్స్‌.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?
మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. రెండు సెట్స్‌పై ఉన్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top