బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

Bigg Boss 3 Telugu Will Rahul Become Captain In Sixth Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌ ఏం చేసినా.. వివాదంగానే మారుతుంది. శ్రీముఖి-రాహుల్‌ గొడవ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇరు వర్గాల ఫాలోవర్స్‌ దీనిపై చర్చించుకుంటూనే ఉంటారు. ఇక రాహుల్‌ టాస్క్‌లో ఆడినా, ఆడకపోయినా హాట్‌ టాపిక్‌గా మారుతోంది. మొదట్నుంచీ ఫిజికట్‌ టాస్క్‌ల్లో కాస్త వెనక్కితగ్గినట్టు అనిపిస్తోందని అందరూ అంటుండగా.. నాగార్జున కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు. ఫిజికల్‌ టాస్క్‌లో కూడా పార్టిసిపేట్‌ చేయాలని నాగ్‌ సూచించిన సంగతి తెలిసిందే.

అలీ కెప్టెన్సీ టాస్క్‌లో ఎన్నో మాటలు చెప్పి.. తీరా ఒక్కొక్కరు చూసుకుందామని చెప్పి.. గివ్‌ అప్‌( వదిలేస్తున్నా) అని చెప్పి ప్రయత్నం చేయకుండా కెప్టెన్సీ టాస్క్‌ను వదిలేశాడు. మళ్లీ టాలెంట్‌ షోలో కూడా పాట పాడుతూ మధ్యలోనే వదిలేశాడు. అయితే మళ్లీ చివర్లో వచ్చి పాడాడు. వితికా కెప్టెన్సీ టాస్క్‌లో ఒంటరిగా పోరాడాడు. తనకు చెయ్యాలనిపిస్తే.. ఎంత కష్టమైన పనినా ఒంటరిగా చేయగలడని నిరూపించాడు.

అయితే ఆరోవారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన చలో ఇండియా టాస్క్‌లో బెస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చిన ముగ్గురు కంటెస్టెంట్ల పేర్లను చెప్పండని ఇంటిసభ్యులను ఆదేశించగా.. వరుణ్‌, రాహుల్‌, బాబా భాస్కర్‌ల పేర్లను సూచించారు. ఈ ముగ్గురిలో వరుణ్‌, రాహుల్‌ చేసిందేమీ లేదని.. ఊరికే చక్రాలు తిప్పుకుంటూ ఉన్నారని, టాస్క్‌ మధ్యలో పడుకున్నారని అలాంటి వారిని బెస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చారని ఎలా చెబుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రాహుల్‌కు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ టాస్క్‌ను మంచిగా ఆడి కెప్టెన్‌గా ఎన్నిక కావాలని అతని ఫాలోవర్స్‌ కోరుకుంటున్నారు. ఈ టాస్క్‌లో గెలిచి.. తన సత్తా ఏంటో హౌస్‌మేట్స్‌తో పాటు అతడ్ని ద్వేషించేవారికి కూడా తెలియజేయాలని ఆశిస్తున్నారు. మరి నేటి.. మట్టిలో ఉక్కు మనిషి టాస్క్‌లో ఎవరు విజయం సాధిస్తారు? కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారు? అనేది చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top