సరికొత్తగా... | banjara movie press meet | Sakshi
Sakshi News home page

సరికొత్తగా...

Dec 17 2018 1:48 AM | Updated on Dec 17 2018 1:48 AM

banjara movie press meet - Sakshi

అమృత

అమృత, ట్వింకిల్‌ కపూర్, తేజేశ్‌ వీర, హరీశ్‌ గైలి, జీవా, బెనర్జీ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బంజార’. గతంలో ‘క్షుద్ర’ వంటి హారర్‌ సినిమాతో ప్రేక్షకుల్ని భయపెట్టిన నాగుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వర్కింగ్‌ యూనిట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కోయా రమేశ్‌బాబు, దేవభక్తుని నవీన్‌ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది.

ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో తెరకెక్కిన మా సినిమాని తెలుగు, తమిళ భాషల్లో జనవరి నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జీవీ, శరత్, ‘వేదం’ నాగయ్య, అనంత్, జ్యోతిశ్రీ, ‘జబర్దస్త్‌’ రాజు, అప్పారావు, శాంతి స్వరూప్, దొరబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఎం. నరేంద్ర.

Advertisement
 
Advertisement
Advertisement