మిస్టరీ థ్రిల్లర్‌ ‘అంధాధున్‌’ | Ayushmann Khurrana And Tabu Starrer AndhaDhun Trailer | Sakshi
Sakshi News home page

Sep 2 2018 12:55 PM | Updated on Sep 2 2018 1:14 PM

Ayushmann Khurrana And Tabu Starrer AndhaDhun Trailer - Sakshi

బాలీవుడ్‌ యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ అంధాధున్‌. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నాడు. సీనియర్‌ నటి టబు మరో ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఏజెంట్‌ వినోద్‌, బద్లాపూర్‌ లాంటి థ్రిల్లర్‌లను తెరకెక్కించిన శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకుడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్‌ అఫీషియల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement
 
Advertisement
Advertisement