ఫుల్‌ యాక్షన్‌ | Arvindswamy’s film with director Nirmal Kumar to start rolling | Sakshi
Sakshi News home page

ఫుల్‌ యాక్షన్‌

Jan 25 2019 3:02 AM | Updated on Jan 25 2019 3:02 AM

Arvindswamy’s film with director Nirmal Kumar to start rolling - Sakshi

అరవింద్‌ స్వామి

ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేశారు నటుడు అరవింద్‌ స్వామి. ఎందుకంటే తన తర్వాతి చిత్రం కోసం. అవును... ఆయన నెక్ట్స్‌ చిత్రం ఖరారు అయ్యింది. నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో అరవింద్‌ స్వామి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఒక లుక్‌తో కనిపించిన అరవింద్‌ స్వామి సెకండాఫ్‌లో మరో లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఈ లుక్స్‌కు సంబంధించి ఆయన ఆల్రెడీ ట్రైనింగ్‌ కూడా స్టార్ట్‌ చేశారు.

మార్చిలో అరవింద్‌ స్వామి లుక్, టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తాం. మార్చి 20న ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో స్టార్ట్‌ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకన్నా ముందు నిర్మల్‌కుమార్‌ దర్శకత్వంలో అరవింద్‌ స్వామి ‘చతురంగ వేటై్ట 2’ అనే సినిమా చేశారు. ఇక  ఆయన కీలక పాత్ర చేసిన ‘నరగాసురన్‌’ (తెలుగులో ‘నరకాసురుడు’) చిత్రం కూడా రిలీజ్‌కు  దగ్గరపడుతోంది. ఇలా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా అరవింద్‌ స్వామి ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement