అబ్బాయిలు పెళ్లి చేసుకోమంటున్నారు : హీరో | Arjun Mathur Says Men send me Dirty Messages | Sakshi
Sakshi News home page

అబ్బాయిలు పెళ్లి చేసుకోమంటున్నారు : హీరో

Jun 12 2019 11:12 AM | Updated on Jun 12 2019 11:30 AM

Arjun Mathur Says Men send me Dirty Messages - Sakshi

తెర మీద తాము చేసే పాత్రలు నటీనటులకు రియల్‌ లైఫ్‌లోనూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. సినిమాలో విలన్‌ పాత్రల్లో కనిపించేవారిని బయట కూడా ప్రేక్షకులు ద్వేషించటం అనేది కామన్‌. అయితే తాజాగా ఓ బాలీవుడ్ హీరోకు విచిత్రమైన సమస్య ఎదురైంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్ సినిమాతో రాహుల్ పాత్రలో నటించిన నటుడు అర్జున్‌ మాథుర్‌.

ఈ సినిమాతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించిన అర్జున్‌కు ఇప్పుడు ఆ వెబ్‌ సిరీస్‌ కారణంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో అర్జున్‌ గే పాత్రలో నటించాడు. దీంతో ఇప్పుడు అర్జున్‌కు అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయట. అంతేకాదు కొంత మంది అబ్బాయిలు అభ్యంతరకర సందేశాలు కూడా పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అర్జున్ మథుర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement