ఛీఛీ ఏం పనిది! | Amala Paul Baby sinha romance scene in Thiruttu Payale 2 | Sakshi
Sakshi News home page

ఛీఛీ ఏం పనిది!

Dec 3 2017 11:43 AM | Updated on Dec 3 2017 11:43 AM

Amala Paul Baby sinha romance scene in Thiruttu Payale 2 - Sakshi

చీ ఎం పనిది ఈ చీత్కారం ఎవరు, ఎవరిపై చేశారో తెలుసా? ఇవాళ సినిమా ట్రెండ్‌ మారిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980–90 చిత్రాలతో నేటి చిత్రాలను ఏ విధంగానూ పోల్చజాలం. ముఖ్యంగా కథానాయికల దుస్తులు, వారి పాత్రల తీరు తెన్నులు చాలా మందికి నచ్చడం లేదు. కేవలం యూత్‌ను ఆకట్టుకుని వ్యాపార పరంగా లబ్ధి పొందే దృక్పథంతోనే హీరోయిన్ల రూపకల్పన జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమా వ్యాపారమే కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడలేం. 

అసలు విషయం ఏమిటంటే తిరుట్టుప్పయలే–2 చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇందులో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అందులో చిటపట చినుకుల్లో బొడ్డుకిందకు చీరకట్టుకున్న అమలాపాల్‌ను బాబీసింహా గట్టిగా బిగికౌగిలిలో బంధించేలా సన్నివేశం చోటుచేసుకుంది. చిత్ర ప్రకటనల్లోనూ ఈ ఫొటోనే వాడారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నటి అమలాపాల్‌ ఒక పత్రికకిచ్చిన భేటీలో తాను బాబీసింహా కౌగిలించుకున్న సన్నివేశం చోటు చేసుకుందని, 

ఆ దృశ్యంలో తన నాభి గురించి ఇంత చర్చ జరుగుతుందని తాను ఊహించలేదంది. చిత్రంలో రొమాన్స్‌ సన్నివేశాల్లో నటించడానికి బాబీసింహా తటపటాయించారని, తానే చొరవ తీసుకుని ఆయన్ని నటింపజేశానని చెప్పింది.  హిందీ చిత్రం పద్మావతి గురించి ఇటీవల ఒక టీవీలో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న ప్రముఖ ఎడిటర్‌ లెనిన్‌ అమలాపాల్‌ ఇంటర్వ్యూను ప్రచురించిన పత్రికను చూపిస్తూ ఛీ ఛీ ఏంపనిది అంటూ  చీరేశారు. మరి ఈ విషయం నటి అమలాపాల్‌ దృష్టికి వెళ్లిందో లేదో? ఒక వేళ వెళితే తను ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement