10 కిలోల బరువు తగ్గనున్న టాలీవుడ్ హీరో | Sakshi
Sakshi News home page

10 కిలోల బరువు తగ్గనున్న టాలీవుడ్ హీరో

Published Sat, Sep 13 2014 12:16 PM

10 కిలోల బరువు తగ్గనున్న టాలీవుడ్ హీరో - Sakshi

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ ఇప్పుడో చక్కనోడు ఓ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడు. అవును.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొదలవుతున్న సినిమా కోసం అల్లు అర్జున్ జిమ్లో విపరీతంగా కసరత్తులు చేస్తున్నాడు. కనీసం పది కిలోల వరకు బరువు తగ్గుతాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'రుద్రమ దేవి' సినిమాలో పాత్ర కోసం అర్జున్ ఇంతకుముందు కొంత బరువు పెరిగాడు.

అయితే, కొత్త సినిమా కోసం పది కిలోలు తగ్గాలని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారట. అందుకోసం ఇప్పటికే అర్జున్ తన కసరత్తు ప్రారంభించాడు. ఈ సినిమాలో బన్నీ సరసన అదా శర్మ, మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తీసిన 'జులాయి' సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు రెండో సినిమా మొదలైంది.

Advertisement
Advertisement