మీరు నన్ను కూడా పిలవాల్సింది : బన్నీ | Allu Arjun Shares His Staff Party Photo | Sakshi
Sakshi News home page

మీరు నన్ను కూడా పిలవాల్సింది : బన్నీ

Jul 7 2019 4:06 PM | Updated on Jul 7 2019 8:04 PM

Allu Arjun Shares His Staff Party Photo - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలకు సంబంధించిన అంశాలనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని పర్సనల్‌ విషయాలను కూడా ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా బన్నీ తన వద్ద పనిచేసే స్టాఫ్‌ను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. తన స్టాఫ్‌ అంతా కలిసి పార్టీ చేసుకున్న ఫొటోను షేర్‌ చేసిన బన్నీ దానిపై సరదాగా స్పందించారు.

‘నేను ఆదివారం లేవగానే ఈ ఫొటో చూశాను. నా స్టాఫ్‌ అంతా శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. వాళ్లు నైట్‌ నా కంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేసి ఉంటారు. మీరు నన్ను కూడా పిలవాల్సింద’ని పోస్ట్‌ చేశారు. తాను స్టైలిష్‌గా డిజైన్‌ చేయించుకున్న కేరవాన్‌ ఫొటోలను కూడా బన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కాగా, ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement