హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్ | ajith vivegam Teaser | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్

May 11 2017 10:27 AM | Updated on Sep 5 2017 10:56 AM

హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్

హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్

కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివేగం టీజర్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారీ

కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివేగం టీజర్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫారిన్ లోకేషన్లలో భారీ యాక్షన్స్ సీన్స్తో రూపొందించిన టీజర్ అభిమానులను అలరిస్తోంది. అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్గా నటిస్తున్నాడు.

సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అక్షర హాసర్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ రిలీజ్ అయిన పది గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సెన్సేషన్ సృష్టించిన వివేగం, టీజర్ తోనూ అదే హవా చూపిస్తోంది. ఆగస్ట్లో వివేగం మూవీ రిలీజ్ కి యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement