Adah Sharma Celebrates Christmas with Classical Dance for Jingle Bells Song | అదా శర్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌ - Sakshi
Sakshi News home page

ఎంచుకున్న రాగమేంటి, చేస్తున్న స్టెప్పేంటి?

Dec 26 2019 12:22 PM | Updated on Dec 26 2019 1:24 PM

Adhah Sharma Classical Dance For Jingle Bells Song - Sakshi

కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న అందాల నటి అదా శర్మ. అప్పుడెప్పుడో ‘హార్ట్‌ఎటాక్‌’తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన ఈ భామ తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, క్షణం వంటి హిట్‌ చిత్రాల్లో అదాశర్మ పరిమిత పాత్రల్లోనే నటించింది. అయితే స్కిన్‌షోకు ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా క్రిస్‌మస్‌ వేడుకల్లో ఆమె చేసిన హంగామాతో మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా క్రిస్‌మస్‌ పండగకు అందరూ కేకులు కట్‌ చేస్తూ, గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ పార్టీలు చేసుకుంటారు.

కానీ అదాశర్మ మాత్రం జింగిల్‌ బెల్‌ పాటకు కాళ్లకు గజ్జె కట్టి తన్మయత్వంతో నృ‍త్యం చేసింది. అది కూడా క్లాసికల్‌ డ్యాన్స్‌ కావడంతో అందరూ కాసేపు ఆశ్చర్యపోయినా తర్వాత అదా పర్‌ఫార్మెన్స్‌ చూసి ముగ్ధులైపోయారు. ఈ వీడియోను అదాశర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు అదా డ్యాన్స్‌కు ఫిదా అవుతుంటే మరికొందరు మాత్రం ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. ‘మీరు ఎంచుకున్న రాగం ఏంటి చేస్తున్న డ్యాన్సు ఏంటి?’ అంటూ అదాపై చమత్కార కామెంట్లు విసురుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement