వోక్స్ వాగన్ కార్ల సంస్థ భారీ మోసం | Volkswagen has said it will set aside 6.5 billion euros to cover the cost of a diesel emissions scandal | Sakshi
Sakshi News home page

వోక్స్ వాగన్ కార్ల సంస్థ భారీ మోసం

Sep 22 2015 9:38 PM | Updated on Aug 14 2018 3:25 PM

వోక్స్ వాగన్ కార్ల సంస్థ భారీ మోసం - Sakshi

వోక్స్ వాగన్ కార్ల సంస్థ భారీ మోసం

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్ వాగన్ ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించింది.

ఫ్రాంక్ ఫర్ట్ : జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్ వాగన్ ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన
సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించింది. అమెరికా మినహా ఇతర దేశాలలో పోల్యూషన్ టెస్ట్ చేయడంతో కొన్ని అనుమానాలు తలెత్తినట్లు తెలుస్తోంది.  తొలుత కేవలం అమెరికాలోని 5లక్షల కార్లలో మాత్రమే లోపాలున్నట్లు తెలిపిన సంస్థ యాజమాన్యం మంగళవారం నాడు భారీ మోసాన్ని అంగీకరించింది. అయితే ఈ కార్లకు సంస్థ ఇదివరకు చెప్పిన ఇంజిన్ అమర్చాలంటే భారత కరెన్సీలో అక్షరాలా 48.10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

టైప్ ఈఏ 189 ఇంజన్లను అన్ని కార్లకు వినియోగించారు. ఈ భారీ మోసం వెల్లడించిన కారణంగా ఈ రోజు సంస్థ షేర్లు 20 శాతం నష్టపోయాయి. గోల్ఫ్, పస్సాట్, జెట్టా, బిటెల్ మోడల్ కార్లలో 2 లీటర్ల సామర్థం ఉన్న ఇంజన్లను అమర్చారు. 2009 నుంచి ఇప్పటివరకూ అమెరికాలో 5 లక్షల కార్ల విక్రయాలు జరిగి ఉంటాయని అంచనా. ఒక విధంగా చెప్పాలంటే ఆ సంస్థ కుంభకోణం 48.10వేల కోట్లు అని మనం అర్థం చేసుకోవచ్చును.

Advertisement
 
Advertisement
Advertisement