కళ్లు తిరిగేవాళ్లు ఈ వీడియో చూడకుంటే బెటర్ | This Person Walking on Building Ledges | Sakshi
Sakshi News home page

కళ్లు తిరిగేవాళ్లు ఈ వీడియో చూడకుంటే బెటర్

Published Tue, Aug 16 2016 1:53 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

కళ్లు తిరిగేవాళ్లు ఈ వీడియో చూడకుంటే బెటర్ - Sakshi

గుండెదడ.. ఎత్తులో నుంచి చూస్తే కళ్లు గిర్రున తిరిగే అలవాటు మీకు ఉందా.. అయితే.. ఈ వీడియో చూడటం మానేయడమే బెటర్. ఎందుకంటే దాదాపు గుండెజారినంతపనైపోవడం ఖాయం. ఇప్పటి వరకు షార్క్ ఉన్న నీటిలో దూకే సాహసికులను చూశాం.. ఎర్రగా మండే నిప్పుల్లో తాఫీగా పరుగులు పెట్టేవారిని చూశాం.. ఎద్దులతో తీవ్రంగా పోరాడేవారిని చూశాం.. కానీ ఈ వ్యక్తి చేసింది మాత్రం అలాంటి ఇలాంటి సాహసం కాదు..

ఒక పెద్ద బహుళ అంతస్తు చివర్లో కంటెగోడపై నిర్లక్ష్యపు నడక.. అది కూడా అటు ఇటూ జంపింగ్లు చేస్తూ పక్క భవనం చివరి అంచుకు ఎగిరి దిగుతూ.. బిల్డిర్ చిన్ పోస్ట్ పేరిట ఫేస్ బుక్ లో ఆగస్టు 9న ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటికే దీన్ని వీక్షించినవారి సంఖ్య కోటి దాటింది. ఇందులో ఓ వ్యక్తి తన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని కనీసం ఆ ఫోన్.. తన ఫేస్ కనిపించకుండా కేవలం దృశ్యాలు మాత్రమే రికార్డయ్యేలా వీడియో తీస్తూ అక్కడికి ఇక్కడి అన్నంతస్తుల భవనంపై గంతులుపెట్టాడు. ఈ వీడియో చూస్తే కళ్లు తిరగడమే కాదు.. కడుపులో ఓ రకమైన వికారంగా కూడా అనిపించవచ్చేమో!

Advertisement
 
Advertisement
 
Advertisement