
ట్రంప్ దూకుడు.. హిల్లరీకి షాక్
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది.
డెట్రాయిట్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. మిస్సిసిపిలో జరిగిన ప్రైమరీల్లో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని కూడా తట్టుకుని ట్రంప్ 50% మంది రిపబ్లికన్ల మద్దతు సాధించారు. డెమొక్రాట్ల విషయానికొస్తే.. మిచిగాన్‌లో హిల్లరీ క్లింటన్ (48శాతం ఓట్లు) ఓడిపోగా.. 50శాతం ఓట్లతో శాండర్స్ విజయం సాధించారు.