నేపాల్‌ ప్రధానమంత్రి ప్రచండ రాజీనామా | Nepal PM Prachanda resign | Sakshi
Sakshi News home page

నేపాల్‌ ప్రధానమంత్రి ప్రచండ రాజీనామా

May 24 2017 4:30 PM | Updated on Mar 18 2019 9:02 PM

నేపాల్‌ ప్రధాన మంత్రి పుష్ప కమాల్‌ దహాల్‌ అలియాస్‌ ప్రపంచ రాజీనామా చేశారు.

ఖాట్మండ్‌ : నేపాల్‌ ప్రధాన మంత్రి  పుష్ప కమాల్‌ దహాల్‌ అలియాస్‌ ప్రపంచ రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా ఆయన తన పదవికి బుధవారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) నేత  షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా నియమితులవనున్నారు. గత ఏడాది ఆగస్టులో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.  తన రాజీనామాను వెల్లడించిన అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచండ తన రాజీనా​మా లేఖను రాష్ట్రపతి విద్యాదేవి భండారికి సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement