సింగపూర్, బ్రూనై సుల్తాన్లతో మోదీ భేటీ | Narendra Modi meets Brunei Sultan, Singapore PM | Sakshi
Sakshi News home page

సింగపూర్, బ్రూనై సుల్తాన్లతో మోదీ భేటీ

Nov 12 2014 6:33 PM | Updated on Oct 4 2018 6:57 PM

సింగపూర్, బ్రూనై సుల్తాన్లతో మోదీ భేటీ - Sakshi

సింగపూర్, బ్రూనై సుల్తాన్లతో మోదీ భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్లో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం మోదీ పలువురు ఆగ్నేయాసియా ప్రముఖులతో భేటీ అయ్యారు. సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్, బ్రూనై సుల్తాన్ హసానల్ బొల్కయాలతో మోదీ సమావేశమయ్యారు.

భారత్, బ్రూనై మిత్ర దేశాలని, తమ సహకారం ఇలాగే కొనసాగుతుందని మోదీ.. బ్రూనై సుల్తాన్తో చెప్పగా, ఆయన స్వాగతించారు. ఇక సింగపూర్ ప్రధానితో మోదీ పట్టణాభివృద్ధికి సంబంధించి చర్చించారు. మోదీ ఇదే రోజు మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ బహుమతి గ్రహీత అంగసాన్ సూకీతో సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement