ఆమె చావుకు కారణం బాయ్‌ఫ్రెండే | Indian-Origin Woman In UK Allegedly Commits Suicide Over Abuse By Boyfriend | Sakshi
Sakshi News home page

ఆమె చావుకు కారణం బాయ్‌ఫ్రెండే

May 9 2017 9:38 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఆమె చావుకు కారణం బాయ్‌ఫ్రెండే - Sakshi

ఆమె చావుకు కారణం బాయ్‌ఫ్రెండే

మీరా దాలాల్‌ ఆత్మహత్యకు కారణం వేధింపులే కారణమని కోర్టు తెలిపింది.

లండన్‌: గత ఫిబ్రవరిలో సంచలనం కలిగించిన భారతీయ సంతతి మహిళ మీరా దాలాల్‌ ఆత్మహత్యకు కారణం వేధింపులే కారణమని కోర్టు తెలిపింది. లండన్‌లో గత ఫిబ్రవరీలో మీరా దలాల్‌ తన బాయ్‌ప్రెండ్‌ వేధింపులు భరించలకే ఆత్మహత్య చేసుకుందని కోర్టు అభిప్రాయ పడింది.

ఇంగ్లాడ్‌, లీసెస్టర్షైర్లోని మీరా దలాల్‌ 2013నుంచి ప్రేమలో ఉంది. బాయ్‌ప్రెండ్‌ వేధింపులు తట్టుకోలేక గత ఫిబ్రవరీలో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మీరా తల్లిదండ్లు స్వతంత్ర పోలీసుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లైఫ్బోరో కోర్టు, డాక్టర్ల నివేదిక ఆధారంగా గతవారం విచారణ చేపట్టింది. ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోవడంతో డాక్టర్ల నివేదికల ఆధారంగా తీర్పు వెలువరించింది.

మీరా తల్లిదండ్రులు విచారణకు కృషి చేసిన పోలీసులకు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వారు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గృహ హింస బాధితులు, వెలివేయబడిన వారికోసం ప్రత్యేకంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement