ఫేస్బుక్ కొత్త వీడియో యాప్ 'రిఫ్' | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ కొత్త వీడియో యాప్ 'రిఫ్'

Published Thu, Apr 2 2015 12:37 PM

ఫేస్బుక్ కొత్త వీడియో యాప్ 'రిఫ్' - Sakshi

సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్ 'రిఫ్' అనే మరో కొత్త యాప్ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు సపోర్ట్ చేసేలా దీనిని ప్రారంభించింది. 20 సెకన్ల విడిదిలో ఒక వీడియోను రికార్డు చేసి మీరు అవతలి వ్యక్తికి పంపించవచ్చు.  దీనికి ఒక టైటిల్ పెట్టడం ద్వారా అవతలి వ్యక్తి నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలియజేయవచ్చు. అలా పంపించడం ద్వారా సృజనాత్మకత ఉన్న మీ స్నేహితుల ద్వారా విరివిగా వీడియోలను పొందవచ్చు.

 

ఫేస్ బుక్ రిఫ్ ప్రొడక్ట్ మేనేజర్ జోష్ మిల్లర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దీని సహాయంతో సహచరుల్లోని సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందిచవచ్చని చెప్పారు.  కొద్ది నిడివి ఉన్న వీడియోలను రూపొందించేందుకు రిఫ్ చాలా బాగా ఉపయోగపడుతుందని, ఫేస్బుక్ ద్వారాగానీ, మరే విధంగానైనా వీటిని ప్రచురించుకోవచ్చని తెలిపారు. ఇటీవల తరచూ వార్తల్లో కనిపించిన ఐస్ వాటర్ బకెట్తో స్నానం చేసిన వీడియోల ప్రోత్సాహంతో రిఫ్ను రూపొందించినట్లు ప్రకటించారు.


రిఫ్ ప్రత్యేకతలు

  • రిఫ్ ద్వారా వీడియోలు మాత్రమే రికార్డు చేయగలము.
  • కొత్తవి అప్లోడ్ చేయడం సాధ్యం కాదు.
  • వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవగానే 3-2-1 అంటూ కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది.
  • దీనికి పోస్టింగ్ ముందు ధృవీకరించుకునే అవకాశం మాత్రం ఉంది.
  • అయితే, ఒకేసారి పలు వీడియోలను రికార్డు చేసే అవకాశంగానీ, ఎడిట్ చేసే అవకాశంగానీ లేదు.
  • కామెంట్ పంపిండం, లైక్ కొట్టడం సాధ్యం కాదు.
  • ఆ వీడియోను పొందిన అనంతరం దానికి బదులుగా మరో వీడియోను షూట్ చేసి మాత్రమే పంపించేందుకు అవకాశం ఉంది.

Advertisement
Advertisement