ఇకపై ఖతర్‌ వెళ్లాలంటే వీసా అవసరం లేదు! | Sakshi
Sakshi News home page

ఇకపై ఖతర్‌ వెళ్లాలంటే వీసా అవసరం లేదు!

Published Wed, Aug 9 2017 6:49 PM

ఇకపై ఖతర్‌ వెళ్లాలంటే వీసా అవసరం లేదు!

దోహా :
సౌదీ నేతృత్వంలోని అరబ్‌ దేశాల నిషేధంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్‌, విదేశీయులకు గుడ్‌ న్యూస్‌ అందించింది. 80 దేశాలకు చెందిన వారు ఖతర్‌లో పర్యటించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఖతర్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  80 దేశాల్లో భారత్‌తో పాటూ యూకే, అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు కూడా ఉన్నాయి.

ఖతర్‌లో ప్రవేశించే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోకుండానే మల్టీ ఎంట్రీ వేవియర్ ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీనికి గానూ ఆరునెలలకు తక్కువగా లేకుండా వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టుతో పాటూ ప్రయాణానికి సంబంధించి టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. 80 దేశాలకు చెందిన పౌరులు ఫ్రీ వీసా వేవియర్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఖతార్ టూరిజం అథారిటీ చైర్మన్‌ హసన్‌ అల్‌ ఇబ్రహిం తెలిపారు.

Advertisement
Advertisement