కిషన్ రెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలుడు | young man injured in electricity transformer explosion | Sakshi
Sakshi News home page

కిషన్ రెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలుడు

May 18 2016 3:18 PM | Updated on Oct 8 2018 3:08 PM

కిషన్ రెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలుడు - Sakshi

కిషన్ రెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలుడు

నగరంలోని బర్కత్‌పురాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

- యువకుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత కిషన్‌రెడ్డి నివాసం సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మంటల్లో చిక్కుకుని ఒక్కసారిగా పేలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడటంతో సమీపంలోనే ఉన్న శ్రీనాథ్(18)కు 80 శాతం కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేత కిషన్‌రెడ్డి భార్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement